'డిస్కో రాజా'కి థియేటర్స్ కొరత వలన ఈరోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం కష్టంగా కనబడుతుంది. డిస్కో రాజాకి బడా సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ ఝలక్ ఇచ్చినట్లే కనబడుతుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో థియేటర్స్ యాజమాన్యాలు రెండో వారం కూడా సినిమాలని కంటిన్యూ చెయ్యడంతో డిస్కో రాజా కి చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు. వాటి నుంచి థియేటర్లు రాబట్టుకోవడం డిస్కోరాజా కు కష్టంగా మారింది. అయినా రవితేజ తన సినిమాని యాజిటీజ్ గా విడుదలకు సిద్ధం చేసాడు. మంచి ప్రమోషన్స్ తో డిస్కో రాజా నేడు విడుదలైంది. తన సినిమాకి హిట్ టాక్ పడితే ఆటోమాటిక్ గా థియేటర్స్ అవే పెరుగుతాయనే ధీమాలో రవితేజ ఉన్నట్లుగా టాక్.