ఇప్పటికే స్టోరీ లైన్ ఓకె చేయించుకుని పూర్తి స్క్రిప్ట్ తో ప్రిపేర్ అవుతున్న వంశి పైడిపల్లి కి మహేష్ మూడు నెలలు టైం పెట్టాడు. ఈలోపు స్క్రిప్ట్ తో పాటుగా నటీనటుల ఎంపిక చేపట్టమని చెప్పినట్టుగా టాక్. భరత్ అనే నేను సినిమాలో మహేష్ కి జోడి గా చేసి.. రామ్ చరణ్ తో కలిసి ప్లాప్ కొట్టిన కియారా పేరు మహేష్ పక్కన హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే టాక్ వినబడుతుంది. మహేష్ వైఫ్ నమ్రత కూడా కియారా పేరునే సూచించినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ మీదున్న కియారా అయితే మహేష్ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందని.. నమ్రత ఇలా అలోచించి కియారా పేరుని సూచించినట్లుగా చెబుతున్నారు.