ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గులాబి రంగు పరికిణీలో చిన్నారి సితార సూపర్బ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 18, 2017, 12:49 PM



టాలీవుడ్ అగ్ర హీరోలు గతంలో సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే.. ఇప్పుడు వారి వారసుల కాలం నడుస్తోంది. తాము ఏమేం కోల్పోయామో అనే విషయం స్పష్టంగా తెలిసిన ఈ హీరోలు.. తమ కుటుంబాలకు ఆ లోటు రాకుండా చాలా అలర్ట్ గా ఉంటున్నారు. ఇలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే స్టార్స్ లో మహేష్ బాబు పేరును మొదటగా చెప్పడం ఏమాత్రం తప్పులేదు.


తను గతంలో ఓ హీరోయిన్ అయినా.. పెళ్లయిన తర్వాత కుటుంబానికే అంకితమయింది మహేష్ వైఫ్ నమ్రత. పిల్లల బాగోగులు.. భర్త సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది నమ్రత. అలాగే.. అభిమానులకు పిల్లల గురించి అప్ డేట్స్ ఇవ్వడంలో నమ్రత ఎంతో ట్యాలెంట్ చూపించేస్తుంటుంది. ప్రతీ సందర్భానికి అందుకు తగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ నెల 20న.. అంటే ఎల్లుండి మహేష్ కూతురు సితార పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. సితారను పట్టు పరికిణీలో  ఓ ఫోటో తీసి నెట్ లో షేర్ చేసింది నమ్రత.


గులాబి రంగు పరికిణీలో చిన్నారి సితార సూపర్బ్ గా ఉంది. జడ కుచ్చులు పెట్టి.. జడను ముందుకు పట్టుకుని.. వడ్డాణం ధరించిన సితార ఫోటో.. చూడముచ్చగా ఉంది. ఐదు సంవత్సరాల వైపు సితార అంటూ.. ఈ బుజ్జాయికి ఐదేళ్ల వయసు నిండుతోందని చెప్పింది నమ్రత. సితార ఈ పరికిణీ ఫోటోను.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com