శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మొదటి సారి నాగ చైతన్యతో చేస్తున్న చిత్రం లవ్ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు. కాగా లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవిల లుక్స్ చాల ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో నాగ చైతన్య పై ఓ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో రాగా అందులో నాగ చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్ లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్ లా కనిపించాడు. ఈ చిత్రాన్ని నారాయణ్ కె నారంగ్, రామ్ మోహన్ రావు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఏయ్ పిల్లా..సాంగ్ ప్రివ్యూ ప్రేమికుల రోజు కానుకగా విడుదల అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంలో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 14 లేదా 16 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెపుతున్న..ప్రస్తుత సమాచారం మేరకు ఏప్రిల్ లో రావడం కష్టమే అని అంటున్నారు. ప్రస్తుతం సినిమా షెడ్యూలు స్లో గా నడుస్తుంది. ఆర్మూర్ షెడ్యూలు డిలే గా పూర్తయింది. హైదరాబాద్ షెడ్యూలు ఓ వారం వుంది. అది అయిన తరువాత దుబాయ్ షెడ్యూలు వుంది. మూడు పాటల షూట్ వుంది. ఇవన్నీ మార్చి లోపు పూర్తయిపోవాలి. లేదూ అంటే ఏప్రియల్ లో అనుకున్న డేట్ కు రావడం కష్టం. అదీ కాక శేఖర్ కమ్ముల తానే దగ్గర వుండి ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ తానే చూసుకుంటారు. సో ఏప్రిల్ లో ఈ మూవీ రావడం కష్టమే అని అంటున్నారు.