ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సునీల్ ఆశలు "కలర్ ఫోటో" పైనే..

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 02:43 PM



తెలుగు తెరపై తిరుగులేని కమెడియన్ గా సునీల్ కొంతకాలంపాటు వెలుగొందాడు. ఆ తరువాత కథానాయకుడిగా ఆరంభంలో విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, కమెడియన్ గా కంటిన్యూ కావడమే బెటర్ అనుకుని వెనక్కి వచ్చేశాడు. అయితే ఆయనకి వెన్నెలకిషోర్ గట్టిపోటీ ఇస్తున్నాడు.


ఈ నేపథ్యంలోనే విలన్ తరహా పాత్రలను చేయడానికి కూడా సునీల్ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. రవితేజ 'డిస్కోరాజా'లో సునీల్ విలన్ గా కనిపించినప్పటికీ ప్రేక్షకులు దానిని కూడా కామెడీగానే తీసుకున్నారు. ఆ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడటంతో, సునీల్ సాహసాన్ని ఎవరూపెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన 'కలర్ ఫోటో' సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మధ్యనే ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన సుహాస్, ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఆయనకి విలన్ గా సునీల్ కనిపించనున్నాడు. విభిన్నమైన ఈ విలన్ రోల్ పైనే సునీల్ ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com