ఇటీవల డబ్బూ రత్నాని 2020 క్యాలెండర్ ఫొటో షూట్ లో పాల్గొంది బాలీవుడ్ నటి సన్నీలియోన్. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఇందులో కబీర్ బేడీ కూడా హాజరు అయ్యాడు. అందులో సన్నీలియోన్ ఫొటో షూట్ ను చూసి ఇంప్రెస్ అయిన కబీర్ బేడీ ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించాడట. ఆమెను ఫొటో షూట్ గురించి అభినందించిన ఆయన ఆమె నెంబర్ అడిగాడట. పెద్దాయన నెంబర్ అడిగినప్పుడు ఇవ్వకుంటే బాగోదని భావించిన సన్నీలియోన్ నెంబర్ ఇచ్చిందట. నెంబర్ అయితే ఇచ్చింది కాని అది ఆమె నెంబర్ కాదట. తన భర్త డానియల్ నెంబర్ ను కబీర్ బేడీకి ఇచ్చిందట. ఆమె భర్త నెంబర్ ఇవ్వడంతో కబీర్ బేడీ అవాక్కయ్యాడట. అందంతో పాటు తెలివి ఉన్న సన్నీలియోన్ ను కబీర్ అభినందించాడు. నెటిజన్స్ కూడా సన్నీలియోన్ తెలికి ఫిదా అయ్యారు.