ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసిన హైపర్ ఆది ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 04:06 PM



జబర్దస్త్ లో హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ ఉంది. ఆది తన ప్రతీ స్కిట్ కోసం అనసూయను వాడేస్తుంటాడు. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలా మరో అమ్మాయిని తన స్కిట్ కోసం తీసుకొస్తుంటాడు. ఆది ఇదే సక్సెస్ ఫార్ములాతో అలా వెళ్లిపోతున్నాడు.  అప్పుడప్పుడూ ఆది స్కిట్స్ కోసం వేసే పంచులు.. రాసుకునే డైలాగులు బయట కూడా బాగానే పాపులర్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఆది తన స్కిట్ కోసం రాసుకున్న మాటల్లోనే అనసూయపై అదిరిపోయే సెటైర్లు వేసాడు. తన స్కిట్ కోసం రాసుకున్న మాటల్లోనే అనసూయపై అదిరిపోయే సెటైర్లు వేసాడు ఆది. ముఖ్యంగా అను రెమ్యునరేషన్ గురించి కూడా చెప్పేసాడు హైపర్ ఆది. దాంతో జబర్దస్త్ బ్యూటీ కూడా స్టేజీపైనే వార్నింగ్ ఇచ్చింది. ఈ వారం ప్రసారం అయిన స్కిట్ అంతా అనసూయపైనే చేసాడు ఆది. అందులో అనసూయ చిన్నప్పటి కారెక్టర్ కూడా ఉంటుంది. అప్పట్నుంచే పక్కన టచ్ అప్ అంటూ మేకప్ మెన్ ఉంటాడు. అక్కడ్నుంచి మొదలైన పంచుల ప్రవాహం పెద్దైన తర్వాత కూడా కొనసాగుతుంది. అనసూయ గారూ మీరు భలే మేనేజ్ చేస్తారండీ అంటే ఆ అందుకేగా అక్కడా ఇక్కడా రెండు చోట్లా బ్యాలెన్స్ చేస్తుందంటూ ఆది పంచ్ వేసాడు. ఆ తర్వాత మూడంతస్థుల మేడ కట్టారు అంటే వెంటనే ఎందుకు కట్టదు.. ఆమెకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకు లక్ష ఇస్తారంటూ రెమ్యునరేషన్‌పై సెటైర్ వేసాడు. దాంతో వెంటనే అనసూయ నా మీద పడి ఏడుస్తావ్ ఎందుకు ఆది అన్నట్లుగా అతడి వైపు కోపంగా చూస్తుంది. ఈ పంచులు అయితే బాగానే పేలాయి.. అక్కడ ఆది రాసిన డైలాగులు కూడా కామెడీ కోసమే అయినా రెమ్యునరేషన్ మాత్రం నిజమే అంటున్నారు అభిమానులు. ఏదేమైనా కూడా అనసూయను వాడకుండా స్కిట్ మాత్రం పూర్తి చేయడం లేదు హైపర్ ఆది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com