ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త చనిపోయిన యువతిగా..

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2017, 01:01 PM



యస్ ఇది నిజం కుర్రకారు మతులు పోగొడుతూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న హాట్ బ్యూటీ రకుల్ తన అప్ కమింగ్ మూవీలో భర్త చనిపోయిన యువతిగా నటిస్తుందని ఫిల్మ్ నగర్ లో ఓ న్యూస్ ప్రస్తుతం షికార్లు చేస్తుంది. అయితే రకుల్ చేతిలో ఇప్పటికే ఓ రెండు మూడు సినిమాలు ఉన్నాయి వీటిలో ఏ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీ విడోగా నటిస్తుందనేదే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఎక్కువుగా గ్లామర్ రోల్స్ లోనే నటించిన రకుల్ ప్రీత్ ఇప్పుడు ఓ బరువైన పాత్రని ఎలా పోషిస్తుందనే విషయం పై ఫిల్మ్ సర్కిల్స్ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయి. 


అలానే ఎంతవరుకు రకుల్ అభిమానులు ఈ పాత్రని యాక్సెప్ట్ చేస్తారు అనే సందేహాం సినీజనాలకి కలుగుతోంది. ఇక ఈ ప్రాతలో రకుల్ ఆ సినిమా డైరెక్టర్ ఎలా చూపిస్తాడనేది ఓ మిలియన్ డాలర్ క్వశ్చిన్ గా మారింది. ఎందుకంటే ఇంతవరకు ఆ దర్శకుడు ఎక్కువుగా హీరోల పైనే ఫోకస్ పెట్టి సినిమాలు తెరకెక్కించాడు కానీ ఈసారి మాత్రం హీరో కంటే హీరోయిన్ చుట్టూనే ఈ కథ ఉండబోతుందని తెలిసింది. మరి హాట్ బ్యూటీ రకుల్ ఓ డీ గ్లామర్ రోల్ తో ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com