ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్టీ స్టారర్ మూవీలో నాని సరసన రకుల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2018, 04:46 PM



క్రితం ఏడాది హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాని, ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. 'భలే మంచిరోజు' .. 'శమంతకమణి' సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ఆయన, నాగ్ - నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.


ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. వరుస హిట్స్ తో నాని జోరు మీద ఉండటంతో, ఆయనతో కలిసి నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలోనే నానితో చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని కనిపించనున్న సంగతి తెలిసిందే.                 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com