ఇటీవలే ట్విట్టర్లోకి వచ్చిన వర్మ మళ్లీ తన ట్వీట్స్‌కి పని చెప్పాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ‘నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంప్ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు వర్మ. ఇక కత్తి మహేష్ రివ్యూపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘ఇప్పుడే కత్తి మహేష్ రివ్యూ వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ కన్నా కత్తి చాలా అందంగా కనిపించాడు’అని ట్వీట్ చేశాడు. దీనికి మహేశ్ కత్తి థ్యాంక్స్ చెప్పగా.. జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆది మాత్రం ‘అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది విరిద్దర్నీ చూస్తే.....!’ అని కామెంట్ చేశాడు. కత్తి మహేష్‌ని వర్మ సమర్ధించడంపై పవన్ అభిమానులు మండిపండుతున్నారు.