ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ కు జోడి కట్టే అదృష్టం ఎవర్ని వరిస్తుందో

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2018, 12:35 PM



ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం మూవీ పూర్తి చేసే పనిలో బిజీ గా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి నెలలో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ ప్లాన్ చేసింది. ఇక ఇది పూర్తి కాగానే చరణ్ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ అంత పూర్తీ చేసి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది.


ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. కైరా అడ్వాణి, అను ఇమ్మానియేల్‌లలో ఒకరిని తీసుకొనే అవకాశాలున్నాయి. చిత్ర నిర్మాతలు ఇద్దరితోనూ చర్చలు జరుపుతోంది. కాల్షీట్ల సర్దుబాటుని బట్టి హీరోయిన్ ఎవరన్నది తేలుతుంది. మరి చరణ్ కు జోడి కట్టే అదృష్టం ఎవర్ని వరిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com