ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవితాలు నాశనం చేశారండీ : పూరి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 12:03 PM



జనాలుకు వార్తలు అందించాలి అన్న వాళ్ళకి నిజాలు ఏంటో సరిగ్గా తెలియజేయాలి అన్న పాలించేవాడికి ఆ పాలన అందుకునే వాడికి మధ్య వారధిగా ఉండాలి అంటే అది ఒక్క మీడియా పని వలన మాత్రమే అవుతుంది. కాని ఇప్పుడు మాత్రం సెన్సేషనలిజం ఒకటే మనోళ్ల స్పెషాలిటీ. ముఖ్యంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విషయంలో చూపించవలిసిన శ్రద్ద కన్నా కొంచం ఎక్కువే పెట్టి అయనపై కొన్ని గంటల పోగ్రాములు చేసి ఉన్న అనుమానాలకు కొత్త ఆలోచనలుకు లేని నిజాలు జత చేసి రకరకలుగా కథలు వినిపిస్తున్నారు. 


డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసు కి వెళ్ళి విచారణకు హాజరు అయిన తరువాత.. తన పై ఇంత అవకాశవాదంగా ప్రవర్తించిన మీడియా పై తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నాడు. “నేను ఈ రోజే SIT ఆఫీసు కి విచారణ కోసం వెళ్ళాను. వాళ్ళు అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. కెల్విన్ తో సంబందాలు లేవని.. నేను డ్రగ్స్ తీసుకోనని చెప్పాను. ఇక ముందు కూడ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్లడానికి సిద్దంగా ఉన్నాను. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. పోలీస్ డిపార్ట్ మెంట్ అంటే చాలా ఇష్టం.. పోలీసులు మీద ఇప్పుడు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. నేను మీడియా మీద కూడా ప్రేమతో ఇజం అనే సినిమా తీశాను.. కాకపోతే ఇక్కడ నాకు భాద కలిగే విషయం ఏంటంటే నా మీడియా మిత్రులు నా పై లేనిపోని కట్టుకథలు చూపించి నానా రబస చేశారు. నాతో ఎంతో ఫ్రెండ్లీ ఉన్న ఈ మీడియావాళ్ళు కట్టుకథలు అల్లేసి ఏవేవో ప్రోగ్రామ్ లు వేసేసి.. జీవితాలు నాశనం చేశారండీ. చాలా డిస్ర్టబ్ చేశారు. నాకు మీడియా అన్న పోలీసు  సిస్టమ్ అన్న అమితమైన గౌరవం ఉంది నేను వాళ్ళ పై చాల సినిమాలు తీశాను. ఇప్పుడు ఏదో నేను ఈ కేస్లో ఉన్నాను అని ఇలా చేయడం సరైన పని కాదు'' అని అభిప్రాయపడ్డాడు పూరి జగన్. ''మళ్ళీ నేను ఆ మీడియా మిత్రులు తో కలిసి పని చేయవలిసి ఉంది. వాళ్ళు చేసిన ఈ పని వలన ఆల్రెడీ నాలుగు రోజుల నుండి నిద్ర లేకుండా తిండి తినకుండా ఏడుస్తూ కూర్చున్న మా అమ్మ భార్య నా పిల్లలు ఇంకా బాధపడుతున్నారు. నాలాంటి కుటంభాలే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఏదన్నా ఉంటే రేపు సిట్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. మీడియా ఇలా చేయడం భావ్యం కాదు” అని తన భాదను పంచుకున్నాడు.


డ్రగ్స్ పై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదాలు విచారణలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది యంగ్ హీరోలు హీరోయిన్లు కూడ ఈ డ్రగ్స్ వాడకం కేస్లో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు సంబందిత వాళ్ళకి నోటిస్లు పంపారు. అందరిని పిలిచి ఒక్కక్కరుగా విచారణ జరుగుతోంది. కాని వీరందరి విచారణ పూర్తయ్యి పోలీసులు ఒక మాట చెప్పేవరకు.. అసలు మీడియా వీళ్ళను దోషులు అంటూ స్టోరీలు  









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com