ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ అడవులకు వెళ్లడానికి సిద్దమైన అల్లు అర్జున్..

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 03:54 PM



కొన్ని రోజులుగా బన్నీ 'అల వైకుంఠపురములో' సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొంత గ్యాప్ తరువాత బన్నీ ఖాతాలో సరైన హిట్ పడటం పట్ల ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో సుకుమార్ తో కలిసి కేరళ అడవులకు వెళ్లడానికి బన్నీ సిద్ధమవుతున్నాడు.


బన్నీ కథానాయకుడిగా సుకుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఎర్ర చందనం రహస్య రవాణ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఈ కథ చిత్తూరు అడవి నేపథ్యంలో నడుస్తుంది. అయితే కొన్ని కారణాల వలన ఆ తాలూకు సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు. మార్చి 13వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. రాయలసీమ యాసలో బన్నీ మాట్లాడనుండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com