మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు . ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించనున్నారని తెలుస్తుంది మహేష్ బాబు షూట్ లో పాల్గొనే డేట్స్ కూడా త్వరలో తెలియనున్నాయి. అయితే ఈ చిత్రంలో మహేష్ పాత్ర గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ రోల్ సినిమాలో స్టూడెంట్ లీడర్ అని, దాదాపు ఇరవై నిముషాల పాటు మహేష్ సినిమాలో కనిపిస్తారని.. అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయట. అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోందట. అయితే ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఇది నిజమేనని చిత్రబృందానికి సంబధించిన దగ్గర వ్యక్తుల ద్వారా తెలుస్తోంది.
ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.