విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో నటించారు. అయితే, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా విశ్వక్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘హిట్’ సినిమా తనకు ఒక ఇమేజ్ను ఇవ్వబోతోంది. దీనికి కారణం నేచురల్ స్టార్ నాని. ‘హిట్’ సినిమాను నాని సమర్పిస్తున్నారు. తాను స్థాపించిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే ‘హిట్’ మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది యూనిట్.
ప్రస్తుతం సినిమాను తీయడం ఒకెత్తు అయితే..దాని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ప్రమోషన్స్ ఓపెనింగ్స్‌పై ఇచ్చే ఇంఫాక్ట్ మాములుగా ఉండటం లేదు. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్ జోరు పెంచింది టాలీవుడ్. రివ్యూ రైటర్స్, వెబ్ బ్లాగ్ రైటర్స్‌ను ఈ మధ్య గట్టిగానే ప్రభావితం చేస్తున్నారు మేకర్స్. అది కేవలం మనీ పరంగానే కాదు..పార్టీల జోరు కూడా మొదలైంది. ఈ స్వింగ్‌లో ముందున్నాడు విశ్వక్సేన్. తాజాగా నెటిజన్లను ఫేస్బుక్లో విఫరీతంగా ప్రభావితం చేస్తోన్న మీమ్స్ క్రియేటర్స్‌కు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో గట్టి పార్టీ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. ఓవైపు నిర్మాతలు నాని, ప్రశాంతి ప్రచారంలో స్పీడ్ చూపిస్తోన్న..తనను తాను ఫోకస్ చేసుకునే ప్రయత్నంలో విశ్వక్ కూడా సినిమాని బాగా పర్సనల్ తీసుకున్నాడట. ఇన్విటేషన్ అందుకున్న వారిలో ఒక వర్గం మాత్రమే పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరో వర్గం సినిమా రిలీజ్ కాకుండా ప్రమోట్ చెయ్యడం సరికాదని సైలెంట్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. స్వతహాగానే యాట్యిట్యూడ్కి బాప్లా బిహేవ్ చేసే ఈ కుర్ర హీరో..ఈ పార్టీలోను కొన్ని తలనొప్పులు తెచ్చుకున్నాడట. వచ్చిన మీమ్స్ క్రియేటర్స్ని కనీసం విష్ కూడా చెయ్యలేదట. ఏది ఏమైనా ఈ యంగ్ హీరో బిహేవియర్ ఎప్పటికప్పుడు కొంత కొత్తగా, ఇంకొంత ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది.