ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ప్రకాష్ మధ్య వార్...అసలేం జరిగిందంటే..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 05:41 PM



పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. పవన్‌ చివరగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. ఈ సినిమాతో  అభిమానులు  నిరాశచెందారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న పింక్‌ సినిమా రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు .ఇప్పటికే పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో పవన్ తో ప్రకాష్ రాజ్ ఆర్గ్ మెంట్ దిగారు. ఒకరినొకరు వాద ప్రతివాదనలతో హోరెతించారు. ఇంతకు అసలేం జరిగిందంటే.. పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' లో పవన్ లాయర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమాలో కోర్ట్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్రబృందం చెప్తుంది. కాగా కేసు విషయంలో ఇద్దరు లాయర్ల మధ్య వాదప్రతివాదనలు జరిగే సన్నివేశం అది ఒక పక్క క్రిమినల్  లాయర్ గా పవన్ వాదిస్తుంటే మరో పక్క నేరం చేసిన వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించే లాయర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇలాంటి సన్నివేశానికి పవన్ ను ఢీ కొట్టేలా ఉండాలనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజును ఎంపిక చేశారు చిత్రయూనిట్.  వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 'మే' లో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com