అమెరికాలో నటుడు మహేష్ బాబు ఫ్యామిలీతో జాలీ ట్రిప్ కి సంబంధించిన కొత్త ఫోటో ఇది. ఈ ఫోటోలో గౌతమ్ – సితార క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా క్యాప్చుర్ అయ్యాయి. రెడ్ జర్కిన్ లో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న గౌతమ్ ని మహేష్ ఫోటో తీస్తున్నాడు. మరోవైపు ఆ ఇద్దరి ముందు సితార ఎంతో లవ్ లీగా తన కోట్ లోకి దూరిపోతోంది. ఈ ఫోటో చూడగానే ఎంతో ఫన్నీగా లవ్ లీగా ఉంది. ఇంత అందమైన ఫోటోని షేర్ చేసిన నమ్రతనే దీనిని క్లిక్ మనిపించారా.. అయితే అందుకు అవార్డు ఇవ్వాల్సిందేనంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ తెలిపారు.