ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాంటిక్ సినిమాలు బోర్ కొట్టేశాయి : హీరోయిన్ నమిత

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 07:05 PM



సౌతిండియాలో ఖుష్బూ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించిన భామ నమిత. హీరోయిన్లంతా జీరోసైజ్ ఫిగర్ మెయిన్‌టెయిన్ చేస్తుంటే...నమిత మాత్రం ఫుల్ సైజు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ‘సొంతం’, ‘జెమిని’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నమిత. ఆ తరువాత  స్లో అయ్యారు. వరుస పరాజయాలు రావడం, దానికి తోడు బరువు కూడా పెరగడంతో నమితకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. అయినా ఏదో అడపాదడపా పాత్రలో నటిస్తూ తన ఉనికి చాటుకుంటూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం సహనటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న నమిత.. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆడియో కార్యక్రమంలో నమిత హాట్ కామెంట్లు చేసింది.


తనకు రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టమని నమిత చెప్పుకొచ్చింది. ఒకప్పుడు ఆ సినిమాలే ఎక్కువగా చూసేదాన్నని.. కానీ చూసి చూసి బోర్ కొట్టేసిందని తెలిపింది. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు నచ్చడం లేదని నమిత పేర్కొంది. ప్రస్తుతం కామెడీ సినిమాలే చూడాలనిపిస్తోందని.. అందుకే ఎక్కువగా హాస్య చిత్రాలే చూస్తున్నానని ఆమె చెప్పింది. ఇక ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా బాలక‌ృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమాలో ఓ పాత్ర కోసం నమిత ఫిక్స్ అయినట్లు ఇటీవల ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా బాలయ్య నటించిన సింహా సినిమాలో నమిత నటించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com