టాప్ యాంకర్ సుమ ఓ ఈవెంట్కు కిటికీలోంచి దూరి లోపలికి వెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఫుల్ మేకప్ వేసుకుని, చక్కగా తయారై ఆమె.. ఇలా కిటికీలోంచి లోపలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నడానికి కారణాలు ఉన్నాయి. ఆమె పాల్గొనబోతున్న ఆ ఈవెంట్ ప్రేక్షకులతో నిండిపోయింది.
తలుపు వద్ద నుంచి వెళ్లడానికి కూడా దారి లేకుండా పోయింది. దీంతో ఆమె చేసేది లేక కిటికీ ఎక్కి లోపలికి వెళ్లింది. ఆమె కిటికీలోకి దూరడానికి సెక్యూరిటీ సిబ్బంది సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు తమ మొబైల్ ఫోన్లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కిటికీలోంచి వెళ్లి ఈవెంట్లో యాంకర్ సుమ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.
సుమక్క గోడ దూకడం ఎప్పుడైనా చూసారా..Anchor Suma Latest Viral Video | Goss... https://t.co/c1MqBkLKen via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 27, 2020