ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిని, చెట్లను కాపాడాలనే మంచి అంశంతో .. :స్వేచ్ఛ సినిమా దర్శకుడు కేపీఎన్‌ చవాన్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 01:36 PM



గాయని  మంగ్లీ  నటించిన  గోర్‌ జీవన్‌  సినిమా  తెలుగులో  స్వేచ్ఛ  పేరుతో  విడుదలకు  సిద్ధమవుతోంది. కేపీఎన్‌ చవాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లచ్చురం ప్రొడక్షన్స్‌ పతాకంపై సరస్వతీ డెవలపర్స్‌ స్వేచ్ఛ సినిమాను నిర్మించింది. రాజు నాయక్‌ నిర్మాత. స్వేచ్ఛ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కేపీఎన్‌ చవాన్‌ మాట్లాడుతూ….పెద్ద సినిమాలకే ఎక్కువ ఆదరణ, ప్రాచూర్యం లభిస్తుంటుంది. కానీ చిన్న చిత్రాల్లోనూ అన్ని వాణిజ్య అంశాలుంటాయి. అమ్మాయిని, చెట్లను కాపాడాలనే మంచి అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. రాజకీయ, సినీ ప్రముఖులు ఇలాంటి మంచి చిత్రాలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. అన్నారు. మంగ్లీ మాట్లాడుతూ..బంజారా భాషలో నిర్మించిన గోర్‌ జీవన్‌ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులోకి ఈ చిత్రాన్ని స్వేచ్ఛ పేరుతో తీసుకొస్తున్నారు రాజు నాయక్‌. ఇదొక మంచి చిత్రం. ఇందులో నాకు గొప్ప పాత్ర పోషించే అవకాశం దక్కింది. స్వేచ్ఛ కూడా విజయం సాధించాలి. అన్నారు. నటుడు చమ్మక్‌ చంద్ర మాట్లాడుతూ…ఆడపిల్లలను ప్రోత్సహిస్తే ఎంతో ఎదుగుతారు. గొప్ప పేరు తీసుకొస్తారు. అలాంటి అమ్మాయిలను కాపాడాలి అనే సందేశంతో రూపొందిన చిత్రమిది. మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి అతిథిగా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com