తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు చాలా ఇష్టమని, తన కుటుంబం లాంటిదని సినీ హీరోయిన్ కామ్నా జఠ్మలానీ చెప్పింది. తన కెరీర్ తెలుగు చిత్రాలతోనే మొదలైందని.. తెలుగులో రణం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కింగ్ తదితర చిత్రాలు చేశానంది. తాను నటిస్తున్న హర్రర్ సినిమా జూన్‌లో రిలీజ్ కానున్నట్టు వెల్లడించింది. తెలుగులో ఇష్టమైన హీరోలు పవన్‌కల్యాణ్, ప్రభాస్ అని, ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమంది. ఓ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె.. ఈ విషయాలు చెప్పింది.