హైదరాబాద్: ఆమెని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అంటున్నారు మంచు మనోజ్. ఇంతకీ ఆమె ఎవరో కాదు మనోజ్ సతీమణి ప్రణతి. ఈరోజు ప్రణతి పుట్టినరోజు. ఈ సందర్భంగా మనోజ్.. స్నేహితులు, సన్నిహితులు సమక్షంలో తన భార్య బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మనోజ్ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘నా మనసు దోచుకున్న ఆమెకి హ్యాపీ బర్త్డే. నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొంటూ బర్త్డే వేడుకల ఫొటో షేర్ చేశారు.
మనోజ్, ప్రణతి 2015 మేలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మనోజ్ ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటిస్తున్నారు. అజయ్ ఆండ్రూస్ దర్శకుడు. ఇందులో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.