ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయ జానకి నాయక టీజర్ అదుర్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 12:21 PM



ఎప్పుడూ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బోయపాటి శీను తన స్టైల్ మార్చేశాడు. రొమాంటిక్ ఫీల్ వున్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'జయ జానకి నాయక' అనే పేరిట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బోయపాటి రెడీ అయిపోయాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండో లుక్ యాక్షన్‌కి సంబంధించినది రిలీజ్ చేశాడు. అలాగే ఫస్ట్ టీజర్లో రొమాంటిక్ లవ్ ప్రాధాన్యత ఇచ్చిన ఆయన.. యాక్షన్ లవ్‌తో కూడిన సీన్స్‌ప రెండో టీజర్‌ను కట్ చేశాడు. 


 ఈ టీజర్లో లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతీసారి లైఫ్‌ను వదులుకోం.. కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. కానీ నేను వదులుకోను.. ఎందుకంటే నేను ప్రేమించా అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ చిత్రంలో జగపతి బాబు విలనిజం అదిరిపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోయిజంపై కట్ చేసిన ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com