ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైనికులకు 26న బన్నీ సెల్యూట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 01:06 PM



స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల్లో డ్యాన్సులతో పాటు యాక్షన్ సీన్లు కూడా ఓ రేంజిలో ఉండేలా చూసుకుంటాడు. అందుకు మాస్ లో అతడికి విపరీతమైన ఇమేజ్ పెరిగింది. తాజా సినిమా దువ్వాడ జగన్నాథమ్ బాక్సాఫీసును పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈసారి స్టయిల్ మార్చి దేశభక్తి ప్రధానాంశంగా సినిమా చేస్తున్నాడు. రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. 


ఫస్ట్ ఇంపాక్ట్ పేరిట నా పేరు సూర్య టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో దేశం కోసం ప్రాణాలిచ్చే ఆర్మీ మాన్ గా బన్నీ పెర్ఫార్మెన్స్  అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వారిలో మరింత జోష్ నింపేలా ఈ సినిమాలోని సైనిక సాంగ్ ను ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. దేశ భద్రత కోసం సరిహద్దుల్లో నిరంతరం ప్రాణాలకు తెగించి పనిచేసే మన సైనికులకు సెల్యూట్ చేస్తూ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తనకన్నా దేశమే మిన్నగా భావించే ఓ సైనికుడిగా అల్లు అర్జున్ పాత్ర ఆకట్టుకుంటుందని  ఈ మూవీ మేకర్స్ చెబుతున్నారు. 


రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మళయాళ బ్యూటీ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com