ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిదా మూవి రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 03:08 PM



సినిమా: ఫిదా
నటీనటులు:వరుణ్ తేజ్,సాయి పల్లవి
కథ,స్క్రీన్ ప్లే,మాటలు దర్శకత్వం:శేఖర్ కమ్ముల
ప్రొడ్యూసర్:దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేస్వర క్రియేషన్స్సం
గీతం:శక్తి కాంత్కె
మెరా మెన్:విజయ్.సి కుమార్  
ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్


వరుణ తేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న మెగా ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది.అయితే మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి నుంచి డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తూ ఉన్నాడు.అయితే ఇంతవరకు వరుణ్ కు కమర్షియల్ గా పెద్ద హిట్ అనేది లేదు.అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ కూడా ఫ్లాప్ కావడం తో ఫిదా పైనే ఆశలు పెట్టుకున్నడు మరి వరుణ్ ఆశలను ఈ సినిమా అయినా నేరవేరుస్తుందో లేదొ ఒక్కసారి చూదాం…


కథ:భానుమతి తెలంగాణలోని బాన్సువాడలో తన అక్క,తండ్రిలతో నివాసం ఉంటుంది.అయితే తన అక్కను చూసుకోవడానికి వరుణ్ తో కలసి వాళ్ళ అన్నయ్య వస్తాడు.ఇక వరుణ్ ఆమెరికాలో ఉంటాడు.అయితే తన అన్నయ్యకు పెళ్ళి చేయడానికి సంభంధం వెతుకుతుంటే భానుమతి అక్క ను చూసి వారు ఇండియాకు వస్తారు.ఇక వరుణ్ అన్న తో భాను అక్క పెళ్ళి కుదరడం జరుగుతుంది.ఇక పెళ్ళి సమయం లో భాను కు వరుణ్ నచ్చడం తో అతనిపై ఫీలింగ్స్ రావడం ,అతను కూడా భాను ను ఇష్టపడడం జరుగుతుంది.అయితే వీరి మధ్య కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల విడిపోతారు.అంతలో భాను ను చూసి హర్ష ఆమె కు లవ్ ప్రపొస్ చేస్తాడు.అయితే ఇదే క్రమంలో అసెల వరుణ్ పై కోపం గా ఉన్న భానుకు వరుణ్ కూడా లవ్ ప్రపోజ్ చేయడం తో రిజెక్ట్ చేస్తుంది.ఇక అసలు వీరు విడిపోవడానికి కారణాలు ఏమిటి…అసలు భాను ఆమెరికా ఎందుకు వెళ్తుంది…అసలు వీరి మధ్య ఏం జరిగింది…చివరికి ఒక్కటయ్యారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…


విశ్లేషణ:ఈ సినిమా లో వరుణ్ ఆమెరికా అబ్బాయిగా బాగా అలరించాడు.తను చాలా స్టైలిష్ గా కొత్తగా కనిపిస్తాడు.కొన్ని చోట్ల వరుణ్ కళ్ళతో ఇచ్చే సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగా చేశాడు.ఇక సాయిపల్లవి తన 150 % పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి.ఆమె నటన,అందం అన్నీ కలగలుపుకుని ఒక తెలంగాణ అమాయిగా తన హవ భావాలతో ,మాటలతో ,పంచ్ డైలాగ్స్ తో అదరగొడుతుంది.భానుమతి క్యారెక్తర్ లో ఆమె ఇమిడిపోయింది.వేరే వారిని కూడ ఊహించుకోలేము.ఇక శేఖర్ కమ్ముల తన మార్క్ కనిపిస్తుంది ఈ సినిమాలో తను ఎంచుకున్న నటులు అందరూ సరిగ్గా సరిపోయారు.ఆయన రాసిన తెలంగాణ డైలాగులు,ఆ వాతావరణ కనిపించేలా ఎంచుకున్న లోకేషన్స్ అన్నీ ఈ సినిమాకు సరిగ్గా సరిపోయాయి.అలాగే సంగీతం ఈ సినిమా కు చాలా ప్లస్.శక్తి కాంత్ మొదటి సారి శేఖర్ సినిమా కు పనిచేయడం అయిన కాని ఆయన మార్క్ మ్యూజిక్ ఈ సినిమాకు అందించాడు.సినిమాకు ఇదే మేజర్ హైలెట్.అలాగే కెమెరా మెన్ కూడా లోకేషన్స్ ను చాలా బాగా క్యాప్త్చర్ చేశాడు.


ఆయన పని తనం కూడా మనకు చాలా చోట్ల కనపడుతుంది.ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు కాని కొన్ని చోట్ల కొంత కాన్స్ట్రేషన్ చేసుంటే బాగుండేది.దిల్ రాజు ప్రొడక్షన్ గురించి చెప్పనక్కర్లేదు.ఆయన చాలా రిచ్ గా కనిపించేలా ఉండడానికి ప్రధాన కారణం ఆయనేఅ .ఇక మిగతా నటీనటులు అందరూఒ ఈ సినిమా కు చాలా బాగా ఓనిచేశారు.శేఖర్ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా చూపించారు.అందరికి కనెక్ట్ అవుతుంది.ఇదిపక్కా శేఖర్ కమ్ముల సినిమా అని సినిమా ఎండింగ్ లో తెలుస్తుంది.కమ్ముల రాసిన సన్నివేశాలకు వరుణ్,సాయిపల్లవి ఇద్దరూ ప్రాణం పోసారు.సాయి పల్లవి ఒకరకం గా వరుణ్ ను డామినేట్ చేసిందనే చెప్పాలి.ఆమె తన డైలాగ్స్ తో ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ ను ఆకట్టుకోవడం ఖాయం.ఈ సినిమా ఆమె పర్ఫెక్ట్ లాంచింగ్ అని చెప్పవచ్చు.


 


ప్లస్ పాయింట్స్:
వరుణ్,సాయి పల్లవి నటన,
పంచ్ డైలాగ్స్,  
నిర్మాణం,
సాంగ్స్,
కథ,
తెలంగాణ సెటప్
హీరో,హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ
డైరెక్టర్.


మైనస్ పాయింట్స్:


కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది.


చివరిగా:యూత్ నే కాదు ఫ్యామిలీను కూడా ఫిదా చేస్తుంది.


రివ్యూ : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com