ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాతలను చెప్పుతో కొడతానన్న హీరోయిన్ శృతి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2018, 04:31 PM



హాలీవుడ్ దర్శకుడు హార్వే విన్‌స్టెయిన్‌ లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరుగా హీరోయిన్లు పెదవి విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు లైంగిక వేధింపుల అంశాన్ని ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ శ‌‌ృతి హారిహరన్ భయంకరమైన వాస్తవాన్ని వెల్లడించింది.ఇండియా టుడే కాంక్లేవ్‌లో సెక్సీజం ఇన్ సినిమా అనే అంశంపై శృతిహారిహరన్ మాట్లాడుతూ.. ఓ తమిళ సినీ నిర్మాత అసభ్యకరమైన వ్యవహారాన్ని మీడియా ముందు పంచుకొన్నారు. సినిమా అవకాశం ఇస్తాం.


కానీ నాతో పాటు మరో నలుగురితో పడకగదిని పంచుకోవాలి అన్నారు అని తెలిపారు.ఇండియా టుడే కాంక్లేవ్‌ చర్చావేదికలో ఆ నాటి భయంకరమైన అనుభావాన్ని గుర్తు చేసుకొంటూ.. నేను ఓ కన్నడ సినిమాలో నటించాను. అయితే ఓ తమిళ నిర్మాత ఆ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. తమిళ రీమేక్‌లో నటించాలని తనను సదరు నిర్మాత కోరారు.అయితే ఆ సమయంలో నిర్మాత ఏమన్నారంటే.. ఈ సినిమాకు మేము ఐదుగురం నిర్మాతలం. ఈ సినిమాలో నీకు అవకాశం ఇచ్చినందుకు మేము నిన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకొంటాం. అలా అయితేనే మేము నీకు ఆఫర్ ఇస్తాం అని ఆ నిర్మాత చెప్పారు.ఆ సంఘటన తర్వాత నిర్మాతల ఒత్తిడితో చాలా సినిమాలు నా వద్దకు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఆమెతో సినిమా చేయడం చాలా ప్రమాదకరం అని నాపై నిర్మాతలు తప్పుడు ప్రచారం చేశారని శృతి హరిహరన్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com