ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షార్ట్ జీన్స్ తో హాట్ గా కనిపించి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 02:03 PM



టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలో కొత్త రకం హై బ్రీడ్ భామలు రంగంలోకి దిగుతున్నారు. చూడగానే ఆడియెన్స్ కి ఇట్టే కనెక్ట్ అవుతున్నారు. అయితే రీసెంట్ గా ఒక ప్రోమో సాంగ్ తో పలకరించిన ఒక అమ్మాయి కుర్ర కారు మతిని పోగొడుతోంది. ఆ మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ తొలి ప్రేమలోని కొన్ని ప్రోమో సాంగ్స్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. 


అయితే అందులో సునోనా సునైనా అనే పాటలో ఒక ఒక కొత్త బ్యూటీ కనిపించింది. షార్ట్ జీన్స్ తో హాట్ గా కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. దీంతో ఆ పాట చూసినప్పటి నుండి కుర్ర కారు ఆ హాట్ లేడి ఎవరని పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఇండియన్ సంతతికి చెందిన ఈ పిల్ల పేరు సప్నా పబ్బి. మొత్తం బ్రిటిష్ సైడ్ ఫ్యాషన్ ప్రపంచంలో పెరిగింది. లండన్ నుంచి ముంబై కి షిఫ్ట్ అయ్యి కొన్ని సీరియల్స్ ద్వారా నార్త్ సైడ్ గుర్తింపు తెచ్చుకుంది. 


అంతే కాకుండా ప్రముఖ GQ అండ్ మ్యాన్స్ వరల్డ్ లాంటి మ్యాగజిన్ ల కవర్ పేజ్ లపై కూడా మెరిసింది. చాలా ఫొటో షూట్ లలో పాల్గొంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి సప్న ని సరికొత్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాలో మంచి క్యారెక్టర్ తో కనిపిస్తుందని టాక్. ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కూడా సప్న నటించనుంది. ముఖ్యంగా పీకు - మద్రాస్ కేఫ్ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వస్తోన్న ఒక సినిమాలో కూడా ఈ బ్యూటీ కనిపించనుంది. 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com