ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 02:09 PM



'అదే పనిగా దేవున్ని చూస్తూ కూర్చుంటే బోర్ కొడుతుందేమో గానీ.. సన్నీ లియోన్‌ను చూడమంటే ఎన్ని గంటలైనా చూస్తారు..' పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ నటిగా మారిన సన్నీ గురించి రాంగోపాల్ వర్మ అభిప్రాయం ఇది. వర్మ చెప్పాడని కాదు కానీ.. కేరళలో ఆమెకు లభించిన స్పందన చూసిన మొత్తం దేశమే ఆశ్చర్యపోయింది. తన అందంతో భారతీయుల్ని అంతలా ఆకట్టుకుంటోంది సన్నీ లియోన్. తాజాగా 'సన్నీ కా హంగామా' అనే కార్యక్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..రోజూ మా వారు డేనియల్‌ వెబర్‌తో కలిసి జిమ్‌కి వెళ్తాను. కచ్చితంగా గంట నుంచి గంటన్నర పాటు జిమ్ చేస్తాను.తెలియదు. కానీ ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. ఈవెంట్‌ పబ్లిసిటీ కోసం 15 ఏళ్ల క్రితం నాటి నా ఫోటోల్ని వాడారు. అయినా అలాంటి ఈవెంట్‌లో పాల్గొనేంత సెలబ్రిటీని కాదు. ఆ వివాదం టైమ్ లో మీడియా నాకు మద్దతుగా నిలిచింది. మనమెంత సున్నితంగా మాట్లాడితే ప్రేక్షకులు మనం చెప్పేది అంతలా రిసీవ్ చేసుకుంటారు.ఇది కూడా చాలా బాధ కలిగించింది. అప్పటికీ టికెట్స్ కొనుక్కుని థియేటర్స్ లో సినిమా చూడాలని షారూఖ్ ఖాన్ ప్రేక్షకులను కోరారు. అయితే పైరసీ బారిన పడినప్పటికీ 'రయీస్‌' ఆల్‌ టైమ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ చిత్రంగా నిలిచింది. సాధారణంగా నేను సినిమాలు చూడను. కానీ ఈ సినిమా చూశాను. నాకు నచ్చింది.సెక్స్‌ ఎడ్యుకేషన్‌ విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత. కేవలం టీచర్స్ చెప్పే పాఠ్యాంశాల వల్ల అది సాధ్యం కాదు. ఈ విషయంలో ఇద్దరు మహిళలు నాకు వ్యతిరేకంగా డిబేట్‌లో పాల్గొన్న వీడియోను చూశాను.


ఇలాంటి సందర్భాల్లో గట్టిగా బదులివ్వాలనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందోనన్న భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి. అయినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే అరిచి చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.పేరు నిషా కౌర్ వెబర్‌. తనొచ్చాక మా జీవితమే మారిపోయింది. ఆడపిల్లలు ఉంటేనే మంచిదని నేను మావారికి ఎప్పుడూ చెప్తుంటాను.ఫ్యాషన్‌, కాస్మెటిక్‌ బిజినెస్ చేయబోతున్నాను. వ్యాపారం‌ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీతో ఓ విషయం పంచుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఓ దుస్తుల కంపెనీ నా ఫొటోతో ఓ టీషర్టును డిజైన్‌ చేసింది. అవి మార్కెట్‌లోకి రావడమే ఆలస్యం.. ఐదు నిమిషాల్లో స్టాక్ అయిపోయిందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com