బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఎగిరిపోయిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇప్పటికీ అప్పుడప్పుడు ఇక్కడ తళుక్కుమంటుంది కానీ.. మొత్తం కాన్సంట్రేషన్ అంతా హాలీవుడ్ పైనే పెట్టేసింది. వెబ్ సిరీస్ లు.. హాలీవుడ్ సినిమాలు.. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కు ఫోటో సెషన్స్ చేస్తూ.. అడపాదడపా అక్కడి టీవీ షోలలో కూడా సందడి చేస్తుంది పీసీ.
అలాగని తనకు పేరు తెచ్చిన ప్లాట్ ఫామ్స్ ను ఈ భామ మర్చిపోవడం లేదు. డబ్బూ రత్నాని క్యాలెండర్ లో గత పదేళ్లుగా కనిపిస్తూ సందడి చేస్తున్న పిగ్గీ ఛాప్స్.. ఈ ఏడాది కూడా తన అందాలతో కనువిందు చేసింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో డిజైన్ చేసిన ఈ ఫోటోలో.. ప్రియాంక అందాలను చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. బ్లాక్ టాప్.. జాకెట్ ధరించిన ప్రియాంక.. కాలి అందాలను మాత్రం ఫోటోలో పరిచేసింది. ఈ భామ ఫోటో సెషన్స్ చేయడం.. అందాలు ఆరబోయడం కొత్తేమీ కాకపోయినా.. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడం ప్రియాంక స్పెషాలిటీ.
ఎన్నేళ్లు గడిచినా చెక్కు చెదరని అందంతో మెరిసిపోతూ.. అభిమానులను ఎప్పటికప్పుడు ఉర్రూతలు ఊగించడంలో ఆరితేరిపోయిన ప్రియాంక చోప్రా.. డబ్బూ రత్నాని క్యాలెండర్ లో మరింత కొత్తగా కనిపించేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోను స్వయంగా షేర్ చేసిన పీసీ.. కొత్త ఏడాదిని ఇంత అందంగా ప్రారంభించినట్లు చెప్పకనే చెప్పింది.