ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హీరోకు జ్ఞాపకశక్తి తక్కువ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 11:37 AM



టాలీవుడ్‌లో ఫిలిం మేకింగ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీది ప్రత్యేకమైనది. అనుకున్న కథను, సీన్లను పక్కాగా తెరకెక్కించడంలో ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పుకొంటాడు. సన్నివేశాలను తాను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి చాలా కష్టపడుతారని, అందుకోసం నటీనటలును కష్టపెడుతారనే పేరును ఆయన సంపాదించుకున్నారు. కృష్ణవంశీతో పనిచేసిన కొందరు నటీనటులు ఆయనతో మళ్లీ పనిచేయాలంటే దడుసుకొంటారు. తనతో పనిచేయడం కష్టమనే ఆరోపణలపై ఇటీవల మీడియాకు కృష్ణ వంశీ వివరణ ఇచ్చారు. అదేమిటంటే..


నాతో కలిసి పనిచేసినవాళ్లలో కొంత మంది తిట్టుకొనే వాళ్లుంటారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే కృష్ణవంశీ దగ్గర చాలా నేర్చుకున్నాను అనే వాళ్లను, అలా చెప్పిన వాళ్లను ఎక్కువ మంది ఉన్నారు. నా గురించి చెడు చెప్పేవాళ్ల కంటే మంచి చెప్పే వాళ్లే ఎక్కువ అని తెలుసు. అదీ చాలు నాకు సంతృప్తి కలుగడానికి అని కృష్ణవంశీ అన్నారు.


నా గురించి చెడుగా చెప్పే వాళ్లలో ఒక హీరో గురించి తెలుసు. అతనికి జ్ఞాపకశక్తి తక్కువని, రెండు డైలాగుల కంటే ఎక్కువ చెప్పలేడని కృష్ణ వంశీ తెలిపారు. ఆ హీరో పేరును ప్రస్తావించడానికి నిరాకరించినట్టు సమాచారం. ఆ హీరో సరిగ్గా పాత్రను అర్థం చేసుకోలేడని, అలా కాదు.. ఇలా చెయ్యి అంటే నాపై ద్వేషం పెంచుకొంటాడని పేర్కొన్నారు


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com