అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది పూజ హెగ్డే. పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అఖిల్, బన్నీ సినిమాలలో కథానాయికగా నటిస్తూ బిజీబిజీగా ఉంది. మరోవైపు కండలవీరుడు సల్మాన్ సరసన కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది తాజా సమాచారం మేరకు పూజ తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం కూడా కొట్టేసిందని.. అంతేకాక ఎందరో తమిళ నిర్మాతలు పూజ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారని పూజ ఇక తమిళ సినిమాలలో నటించకుండా తమిళ సినిమాలకే ఓకే చెపుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై పూజ హెగ్డే స్పందించింది.నేను కేవలం తమిళ సినిమాలే చేస్తున్నాననే అపోహలకు పోవద్దు. ఇప్పటివరకు నేను ఏ తమిళ సినిమాకు సంతకం చేయలేదు. నాకు కొంతమంది దర్శకులు కథలను వినిపించారు. కానీ నేను ఇంతవరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ తప్పకుండ ఈ ఏడాది ఒక తెలుగు సినిమా చేస్తాను అని పూజ హెగ్డే తెలిపింది.