నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ సినిమాలో చైతూ సరసన నాయికగా సాయిపల్లవి అలరించనుంది. చైతూ కెరియర్లో ఇంతవరకూ చేసిన సినిమాల్లో ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా ఆదరణ పొందాయి. ఆయన చేసిన ఆ తరహా కథలు భారీ వసూళ్లను సాధించాయి. అందువలన ఆయన తాజా చిత్రమైన 'లవ్ స్టోరీ'కి మంచి డిమాండ్ ఏర్పడింది.ఈ సినిమా శాటిలైట్ హక్కులు .. ఓవర్సీస్ హక్కులు భారీ రేటు పలుకుతున్నాయట. శేఖర్ కమ్ముల ఇంతకుముందు చేసిన 'ఫిదా' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం, ఆ సినిమాకి ఓవర్సీస్ లో విశేషమైన ఆదరణ లభించడం 'లవ్ స్టోరీ'కి మంచి డిమాండ్ ఏర్పడటానికి మరో కారణమని చెబుతున్నారు. ఇటు చైతూ .. అటు సాయిపల్లవి ఇద్దరూ కూడా చెరో హిట్ పడిన తరువాత చేసిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను వాళ్లు ఎంతవరకూ అందుకుంటారో చూడాలి మరి.