ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్న పూజిత

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 10:35 AM



పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇది రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందట. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించారు. జాక్విలిన్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం.ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఆ పాట కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. 'కల్కి' .. 'రంగస్థలం' సినిమాల్లో పూజిత పొన్నాడ సందడి చేసింది. ఆకర్షణీయమైన ఆమె రూపానికి కుర్రకారు ఫిదా అయ్యారు. పవన్ - క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటమ్ సాంగ్ తో మరింత పాప్యులర్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com