ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేడీ ఒరియెంటెడ్‌ సినిమాలో అనుపమ...

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 11:14 AM



అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. 'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ కుట్టి. కాగా ఆ మధ్య ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా అలరించలేకపోవడంతో కొంత వెనుకబడ్డది. అయినా వచ్చిన అవకాశాల్నీ వదలుకోకుండా అదరగొడుతూనే ఉంది. అనుపమ ప్రస్తుతం దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నాడు. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాతో పాటు మరో సినిమాలో అనుపమకు అవకాశం వచ్చింది.ఉమెన్ ఒరియెంటెడ్‌ కథతో వస్తోన్న ఈ సినిమాలో కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హనుమాన్ చౌదరి పరిచయం కానున్నాడు. గతంలో ఆయన రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో 'అవును' సినిమాకి పనిచేశాడు. ఈ సినిమా తమిళ తెలుగు భాషాల్లో తెరకెక్కనుందట. కాగా అనుపమ చివరిసారిగా తెలుగులో కనిపించిన సినిమా 'రాక్షసుడు'. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేసిన ఈ సినిమాలో టీచర్ పాత్ర చేసిన అనుపమ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com