ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ సినిమా జూలై 30న విడుదల చేసే ఛాన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 11:33 AM



వరుణ్ తేజ్ కథానాయకుడిగా సిద్ధు - ముద్ద నిర్మాణంలో .. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. సహజత్వం కోసం ఆయన కొంతకాలం పాటు బాక్సింగులో శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. అందువలన ఈ సినిమాకి 'బాక్సర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.ఈ సినిమాలో ఒక కథానాయికగా సయీ మంజ్రేకర్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కీలకం కానుంది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 2' .. 'గద్దలకొండ గణేశ్' భారీ విజయాలను సాధించాయి. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com