హైదరాబాద్: ఎన్టీఆర్ కుమారుడు అభయ్‌రామ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ముద్దుల తనయుడికి సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘బిగ్‌బాస్’ షో సెట్లో అభయ్‌రామ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ‘నా సంతోషానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఒక వరం. అందరికీ ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.
నా ప్రియమైన స్నేహితుడు అభయ్‌రామ్
ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు అభయ్‌రామ్ ప్రియమైన స్నేహితుడట. ఈ విషయాన్ని కొరటాల ట్విటర్లో పేర్కొన్నారు. ‘నా ప్రియమైన స్నేహితుడు అభయ్‌రామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. (నవ్వుతూ) నిజంగానే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. దేవుడు నిన్ను దీవించుగాక’ అని కొరటాల ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘జై లవ కుశ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాబీ(కె.ఎస్. రవీంద్ర) దర్శకుడు. రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతోపాటు ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.