ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే శ్రీముఖి సినిమాలు మానేసిందా...?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 07:24 PM



పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి... ఆ తర్వాత తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో మూడు నెలలకు పైగా తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి ఆ షో ముగిసిన తర్వాత కాస్త విరామం తీసుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తూ ఫుల్లు బిజీగా  ఉంటోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎపుడు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈమె ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని రవితో తన రిలేషన్ షిప్‌తో పాటు తన చిన్ననాటి విషయాలు.. సినిమాల్లో నటించకపోవడానికి గత కారణాలను వెల్లడించింది. శ్రీముఖి ‘జులాయి’ చేస్తున్నపుడే ఇదే మొదటి, చివరి చిత్రమని నాన్న చెప్పారు. ఆ తర్వాత ఒకటో రెండో సినిమాలు చేసాను. ఆ తర్వాత పూర్తిగా మానేసానంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారు కూడా టీవీల్లో ఎక్కువ షోలు చేస్తే.. సినిమాల్లో ఛాన్సులు రావు. మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేయమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చింది. అయితే అదే సమయంలో నా దగ్గరకు వచ్చిన కథలేవి నన్ను సంతృప్తి పరచలేదు. ఎక్కువగా చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. అందులో ఎక్స్‌పోజింగ్ చేయమని.,. ముద్దు సీన్లలో యాక్ట్ చేసే సినిమాలే తన దగ్గరకు ఎక్కువగా వచ్చాయంది. అందుకే సినిమాల్లో నటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com