సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి అనేవి ఎప్పుడెలా ఉంటాయో అర్థం కాదు. మహానటి సినిమాలో జెమిని గణేషన్ చెప్పినట్లు పెళ్లైన వాడు ప్రేమిస్తే అది పెళ్లికి పరీక్షో.. లేదంటే ప్రేమకు పరీక్షో తెలియదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఓ హీరో తను ప్రేమించిన హీరోయిన్ కోసం ఏకంగా మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు కూడా. ఇంతకీ ఎవరా హీరో.. ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..?తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన సునయన కోసం ఓ తమిళ హీరో భలే ఆరాటపడుతున్నాడు ఇప్పుడు. ఆయన పేరు కృష్ష కులశేకరన్.. తమిళనాట ఈయనకు పాపులారిటీ పర్లేదు. చిన్న సినిమాలతో మెప్పిస్తున్నాడు కృష్ణ. 10th క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సునయన.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో తమిళనాట వెళ్లి సెటిల్ అయిపోయింది. అక్కడే పవన్ కళ్యాన్ పంజా దర్శకుడు దర్శకుడు విష్ణువర్ధన్ సోదరుడు కృష్ణ కులశేకరన్తో ప్రేమాయణం నడిపిస్తుంది.చాలా ఏళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తమిళ ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. అయినా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రేమ ముదిరి పాకాన పడిందని ప్రచారం జరుగుతుంది. అదేనండీ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే కృష్ణ కులశేకరన్కి ఇది వరకే పెళ్లి అయింది.. ఈ నేపథ్యంలో సునయన తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఏదోలా వాళ్లను మాయ చేసి ఒప్పించినట్లు తెలుస్తుంది. ఏప్రిల్లోనే జరగాల్సిన వీళ్ల వివాహం లాక్డౌన్ కారణంగా వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు కొన్ని మంచి విజయమే సాధించాయి.