ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందినీ రెడ్డి సినిమా కోసం చైతూను ఒప్పించిన సమంత!

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 08:43 PM



నందినీ రెడ్డి ఒక మంచి కథను సిద్ధం చేసుకుందట. మార్కెట్ బాగానే వున్న ఒక యంగ్ హీరో ఆ కథకి కావాలి. అయితే ఇప్పుడున్న యువ కథానాయకులలో చాలా మంది ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగానే వున్నారు. దాంతో ఆమె హీరో సెట్ కాకపోవడంతో ఆలోచనలో పడిందట. ఆ విషయం తెలుసుకున్న సమంత వెంటనే హీరోను సెట్ చేసింది .. ఆ హీరో ఎవరో కాదు .. నాగచైతన్య.ఆ మధ్య సమంతతో నందినీ రెడ్డి 'ఓ బేబీ' సినిమా చేసి హిట్ ఇచ్చింది. సమంత కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి కూడా సమంత - నందినీ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన నందినీ రెడ్డి ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో చైతూను సమంత ఒప్పించిందని అంటున్నారు. ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగానే వున్నాడు. అయినా సమంత రిక్వెస్ట్ ను కాదనలేక ఆయన ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com