ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుడి కోసం 'చిరు' కసరత్తు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 08:45 PM



టాలీవుడ్ లో వారసత్వానికి కొదవలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలయ్యారు. అందునా సక్సెస్ ఫుల్ హీరోలు కూడా మరే ఫ్యామిలీ లోను లేరు. లేటెస్టు గా వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి అందరూ బిజీగా ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. అయితే చిరంజీవి అల్లుడు మాత్రం వీళ్ళ దారిలో నడవలేక పోతున్నాడు. చిరంజీవి అల్లుడిగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్. 'విజేత' సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా పర్వాలేదు అనిపించుకున్నాడు. కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా 'సూపర్ మచ్చి' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇదిలావుండగానే కళ్యాణ్ మరో చిత్రాన్నీ లైన్ లో పెట్టాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వం లో ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రకటించాడు. టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జిఎటూ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది. అందుకే ఇప్పుడు మెగాస్టార్ తన అల్లుడి కోసం స్వయంగా రంగంలోకి దిగాడట. మాములుగా మెగా హీరోల అందరి సినిమాల కథల విషయంలో కల్పించుకొనే చిరు ఇప్పుడు అల్లుడి కోసం మంచి డైరెక్టర్ ని లైన్ లో పెడుతున్నాడట. అందుకే ఇప్పుడు మెగాస్టార్ ఈ ప్రాజెక్టుల్లో ఒకటి వర్క్ అవుట్ కాదని పక్కన పెట్టేయమని చెప్పాడట.అంతేకాకుండా అల్లుడి సినీ కెరీర్ గాడిలో పెట్టడానికి స్వయంగా రంగంలోకి దిగి కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ మారుతి ని టచ్ లో పెట్టాడట. తన అల్లుడి కోసం మంచి కామెడీ నేపథ్యంలో స్క్రిప్ట్ రెడీ చేయమని అడిగాడట. అయితే 'ప్రతిరోజూ పండగే' సినిమాతో మంచి జోష్ మీద ఉన్న మారుతి తన నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో ప్లాన్ చేసుకుంటున్నాడు. అందువల్ల చిరు ఆఫర్ ని మారుతి సున్నితంగా తిరస్కరించాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ఎలాగైనా అల్లుడి కెరీర్ గాడిలో పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట. అందుకే మారుతి కాకపోతే ఇంకొక డైరెక్టర్ ని పెట్టాలని యోచిస్తున్నాడట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com