ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి ఫొటోలు లీక్‌.. వ్యక్తి అరెస్టు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 03:48 PM



కేరళ: తన వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేశారని మలయాళ నటి మైతిలి కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ కిరణ్‌ కుమార్‌ను ఆదివారం అరెస్టు చేశారు. కిరణ్‌ తన ఫొటోలను లీక్‌ చేసినట్లు నటి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వివాహితుడైన కిరణ్‌, మైతిలి 2008లో స్నేహితులయ్యారు. ఆ తర్వాత కిరణ్‌కు వివాహం జరిగిపోయిందని తెలుసుకున్న మైతిలి ఆయనకు దూరంగా ఉన్నారు.


కిరణ్‌ దగ్గర మైతిలి ప్రైవేటు ఫొటోలు ఉన్నాయట. వాటిని ఆయన అడ్డం పెట్టుకుని డబ్బులు ఇవ్వాలని మైతిలిని బెదిరించినట్లు సమాచారం. ‘సోషల్‌మీడియా సైట్లలో ఈ ఫొటోలను వ్యాప్తి చేసిన మరికొందరు ఉన్నారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం బయటపడింది. వారిని కూడా అరెస్టు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఎర్నాకులం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె. లార్జీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com