ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా రోహిత్ 'బాలకృష్ణుడు' ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 06:21 PM



పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న కొత్తచిత్రానికి 'బాలకృష్ణుడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు నారా రోహిత్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేశారు యూనిట్ సభ్యులు. శరశ్చంద్రికా విషనరీ మోషన్ పిక్చర్స్ మరియు మాయాబజార్ పిక్చర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.




సిక్స్ పాక్స్ బాడీతో తన కెరీర్లోనే మొదటిసారి నారా రోహిత్ వెండితెరపై దర్శనమిస్తున్నాడు. రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. నరసింహ సినిమాలో నీలాంబరి, బాహుబలి సినిమాలో శివగామి తరహాలో ఎంతో కమాండ్ ఉన్న పాత్ర రమ్యకృష్ణ చేస్తోంది. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈసినిమాకు మణిశర్మ బాణీలు కట్టారు. ప్రస్తుతం నార్వే లో పాటల షూటింగ్ జరుగుతోంది. దాదాపుగా షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈచిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com