ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంజయ్‌దత్ నోట ఆమె పేరు రావడం మాత్రం

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 12:17 PM



ఆమెకు ఎప్పుడో వివాహం అయిపోయింది.. వయసు కూడా చాలానే మీద పడింది.. అయితే ఇప్పటికీ చాలా మందికి డ్రీమ్‌గర్ల్ గానే ఉంది.. అదీ మాధురీ దీక్షిత్ ప్రత్యేకత. అత్యంత అందమైన బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా పేర్గాంచిన మాధురీకి పెద్ద పెద్ద వాళ్లే ఫిదా అయిపోయారు. బహిరంగంగానే తమ ప్రేమను వ్యక్తీకరించారు. అలాంటి వారిలో ఒకరిగా నిలుస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్. ఇటీవల దత్ మీడియాతో చేసిన చిట్‌చాట్ లో మాధురీపై తన ఆరాధనను వ్యక్తీకరించాడు. సరదాగానే అయినా.. దత్ కు ఆమెపై గల ఇష్టం బయటపడింది,


మీకు మరోసారి పెళ్లి చేసుకునే అవకాశం గనుక వస్తే ఎవరిని చేసుకుంటారు? అని మీడియా దత్ ను సరదాగా అడగగా, టక్కున ‘మాధురీ దీక్షిత్’ అనేశాడు దత్. మరి వేరే ఎవరైనా మాధురీ పేరు చెబితే అది వారికి ఆమెపై గల ఆరాధనే కారణం అనుకోవచ్చు కానీ.. దత్ నోట ఆమె పేరు రావడం మాత్రం ఒకింత ప్రత్యేకమే. ఎందుకంటే.. ఒకప్పుడు మాధురీతో దత్ చాలా సన్నిహితంగా ఉండేవాడు.


టాడా కేసులో తొలిసారి జైలుకు వెళ్లక ముందు... దత్, మాధురిలు పీకల్లోతు ప్రేమలో మునిగారని అంటారు బాలీవుడ్ జనాలు. ఆమె ప్రేమలో సేదతీరుతుండగా కేసులు చుట్టుముట్టి దత్ ను జైలుపాలు చేశాయని అంటారు. ఆ తర్వాత మాధురీ, దత్ ల మధ్య దూరం పెరిగింది. తర్వాత కొంత కాలానికి మాధురి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. మాధురికి ఇద్దరు పిల్లలు కూడా, ఇక దత్ కి మాన్యతతో వివాహనంతరం ఇద్దరు పిల్లలు పుట్టారు.


ఇలా సెటిలైపోయారిద్దరూ. అయితే ‘మరోసారి గనుక పెళ్లి చేసుకునే అవకాశం వస్తే..’ అనగానే మాధురీ పేరును దత్ చెప్పడంతో.. పాత ప్రేమకథంతా గుర్తుకురాకమానదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com