ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పైడర్ టిజర్ తోపాటుగా.. భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 12:25 PM



 సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాల జోరు పెంచబోతున్నాడు. కొన్ని నెలలుగా స్పైడర్ సినిమా విడుదల పై రకరకాల కథనాలు మనం చూస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఒక సెప్టెంబర్ లో దసరా సినిమాగా రాబోతుంది . కానీ మహేశ్ బాబు స్పైడర్ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు . ఇప్పుడు  స్పైడర్ సినిమా ప్రమోషన్ వేగవంతం చేయడానికి అన్నీ సిద్దం చేస్తునట్లు తెలుస్తుంది.


ఆగష్టు 9 నాడు మహేశ్ బాబు పుట్టిన రోజు ఉంది ఆ  రోజున అభిమానులును ఉత్సాహ పరచడానికి స్పైడర్  టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా గా రూపొందిన ఈ సినిమా పై తెలుగు తమిళ్ అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదే రోజున స్పైడర్ టిజర్ తోపాటుగా  కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారట.  మహేశ్ బాబు స్పైడర్ టీజర్ - భరత్ అనే నేను సినిమాలో ఉండే యంగ్ పోలిటికల్ లీడర్ ఫస్ట్ లుక్ ఆగష్టు 9 నాడు వచ్చేస్తే.. అభిమానులు వావ్ అనుకోరు!!


 


శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరపుకుంటుంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కి విడుదల చేస్తారు. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు చీఫ్ మినిస్టర్ గా నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులలో భారీ అసెంబ్లీ సెట్ కూడా  నిర్మించారు. ఇలా ఒకే రోజు మహేశ్ బాబు ను స్పై లుక్ ఇంకా ప్లోటికల్ లీడర్ లుక్ చూసే అవకాశం కోసం మరి అభిమానులు ఇంకో నెల ఎదురు చూడాల్సిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com