ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాల ప్రణీత అలా ఎడారిలో తప్పిపోయిందట

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 03:39 PM



గ్లామర్ పరంగా కుర్రకారు మనసులు దోచేసిన ప్రణీతకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవు. దాంతో ఆమె కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ ఆమె ప్రయత్నాలు ఫలించి వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఆమె శివరాజ్ కుమార్ సరసన ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలోని ఒక పాటను 'ఖతర్' ఎడారి ప్రాంతంలో చిత్రీకరించారు.


 ఎడారి లోపలికంటూ వెళ్లి అక్కడి ఇసుక దిబ్బలపై ఈ పాటను షూట్ చేశారు. పేకప్ చెప్పేశాక అంతా అక్కడి నుంచి బయల్దేరారు. ఆ సమయంలో ప్రణీత కారు దారి తప్పి .. యూనిట్  సభ్యుల నుంచి వేరైపోయింది. ఎటు వెళ్లాలో .. ఎక్కడ ఉన్నామో తెలియక ఆమె చాలా ఆందోళన చెందిందట. విషయాన్ని గ్రహించిన యూనిట్ సభ్యులు సెల్ నెట్ వర్క్ ను ఉపయోగించి ఆమె జాడ తెలుసుకుంటూ వెళ్లి తీసుకువచ్చారట. ఈ అనుభవం తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రణీత చెబుతోంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com