ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్‌తో రష్మిక మందన్న...!

cinema |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 04:52 PM



చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఈయన అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, కొత్త దర్శకుడు ప్రదీప్‌లలో ఒకరితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఈ మధ్యలోనే మరో సినిమా చేయనున్నాడు చరణ్. అదే తన తండ్రి చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్‌ను అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది. బయటికి వచ్చిన ఫోటోలు చూస్తుంటే చిరు నక్సలైట్ అని అర్థమవుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, చరణ్ గురు శిష్యులుగా నటిస్తున్నారు. ముందు మహేష్ బాబును అనుకున్నా కూడా రెమ్యునరేషన్ మరీ ఎక్కువ అడిగాడని అతన్ని కాదని చరణ్‌ను తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో చరణ్ పాల్గొనబోతున్నాడు. ఇన్ని రోజులు వేచి చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. రామ్ చరణ్, రష్మిక మందన్న జంటగా నటించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరోను కవర్ చేసుకుంటూ వచ్చిన ఈమె ఇప్పుడు చరణ్‌తో కూడా రొమాన్స్ చేయబోతుందని ప్రచారం జరుగుతుంది.  లాక్‌డౌన్ పూర్తైన తర్వాత నెల రోజులు ఈ చిత్రం కోసమే డేట్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com