ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ మూవీలో దీపికా పదుకొనె ?

cinema |  Suryaa Desk  | Published : Sun, May 31, 2020, 05:56 PM



 ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విన దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భారీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 సమ్మర్ లో విడుదల అయ్యే సూచనలు కలవు. కాగా ఈ చిత్ర హీరోయిన్ పై కొద్దిరోజులుగా పరిశ్రమలో అనేక పుకార్లు పుట్టుకు వచ్చాయి. మొదట దీపికా పదుకొనె ఆ తరువాత అలియా భట్, కత్రినా ఖైఫ్ ఇలా అనేక పేర్లు వినిపించాయి. ఐతే ఈ మూవీలో దీపికా నటించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. దీపిక తన ఇంస్ట్గ్రామ్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి మూవీ చూడాలని ఫ్యాన్స్ ని కోరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభాస్ మూవీలో దీపికా ఫిక్స్ అయ్యిందేమో అనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com