రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ.. కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి. ముందుగా ఈ భామ పరిచయమైంది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ మూవీ. ఈ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోనా అంటూ చేసిన డాన్స్‌కు అందరు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఈ భామ 'కిక్2', 'లోఫర్', 'ఊపిరి' చిత్రాల్లో ఐటమ్ నంబర్స్‌కు డ్యాన్స్‌లు చేసింది. ఇటూ తెలుగులో చేస్తూనే అటూ హిందీలో కూడా ఇరగదీస్తోంది. అందులో భాగంగా.. సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో కనిపించింది. అంతేకాకుండా నోరా.. 'స్ట్రీట్ డ్యాన్సర్'లో వరుణ్ ధావన్ సరసన మెరిసింది. తాజాగా ఈ భామ దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్య కార్మికుల కోసం పీపీఈ కిట్స్ అందజేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పీపీఈ కిట్స్ పంపిణీ చేసింది. త్వరలోనే మిగతా హాస్పిటల్స్‌కు తన వాళ్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. మొత్తంగా హీరోయిన్గా నటించి కోట్లకు కోట్లు తీసుకునే వాళ్లు కూడా ఇలాంటి ఆపద సమయంలో తాము ఇంట్లో చేస్తున్న పిచ్చి పిచ్చి పనులను షేర్ చేస్తున్నారు కానీ.. ఎవరిని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. కానీ ఐటెం సాంగ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన వంతు బాధ్యతగా పీపీఈ కిట్స్ హాస్పిటల్స్‌కు ఇవ్వాలనే నిర్ణయం మెచ్చుకోవాల్సిందే.