లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మూకుతి అమ్మన్ అనే చిత్రం చేస్తుంది. ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా నయనతార గెటప్‌కి సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో మూకుతి అమ్మన్ గా నయన్ లుక్ అదిరిపోయింది. నయనతార ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.