యాక్షన్ సినిమాలకు హాలీవుడ్ పెట్టింది పేరు. వీటిలో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం జురాసిక్ పార్క్. ఈ సినిమా సిరీస్ చిత్రాలన్నీ వసూళ్లలో చరిత్ర సృష్టించాయి. ఒక్క సినిమాతో ఆగిపోకుండా కొనసాగింపు చిత్రాలతో గొలుసులు కట్టాయి. వీటిలో ఎక్కువ ఆసక్తి కలిగిస్తోంది జురాసిక్ పార్క్ కొత్త చిత్రం ఫాలెన్ కింగ్‌డమ్. మనలో చాలా మందికి పరిచయమీ హాలీవుడ్ చిత్రం. చిన్న పెద్దా అంతా ఇష్టపడి చూసే ఈ రాకాసి బల్లుల సినిమా ఇప్పటికే అత్యంత విజయవంతమైన సినిమా సిరీస్‌గా నిలిచింది. త్వరలో జురాసిక్ పార్క్ సిరీస్‌లో మరో కొత్త చిత్రం జురాసిక్ పార్క్ ఫాలెన్ కింగ్‌డమ్ రాబోతోంది. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు జేఏ బయోనా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
క్రిస్ పాట్, హోవార్డ్‌్, బీడీ వాంగ్, జేమ్స్ క్రోమ్ వెల్ ప్రధాన పాత్రలు పోషించారు. డైనోసార్‌ల థీమ్ పార్క్ లో అగ్ని పర్వతాల పేలుడు జరుగుతుంది. ఈ ప్రమాదం నుంచి డైనోసార్‌లను రక్షించే ప్రయత్నం చేస్తారు ప్రధాన పాత్ర ధారులు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సంఘటనలు ఏంటనేది ఆసక్తికరమైన కథాంశం. జురాసిక్ పార్క్ ఫాలెన్ కింగ్‌డమ్ సినిమా జూన్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.